సీహెచ్ అగ్రహారం గ్రామానికి చెందిన చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై 22 రోజులు గడిచినా, ఆమె ఆచూకీ ఇంకా లభించలేదు. పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. సుమారు 50 ఎకరాల పామ్ ఆయిల్ తోటలో ఉన్న గడ్డిని భారీ యంత్రాలతో తొలగిస్తూ, ప్రతి అంగుళాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కేసును ఛేదించేందుకు అధికారులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.