కాకినాడ జిల్లా తునిలో రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో తొమ్మిదో రోజు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పోలీసు, SDRF, అటవీ శాఖ బృందాలతో పాటు తాజాగా NDRF కూడా అధునాతన డ్రోన్ల సాయంతో అడవులు, పరిసర ప్రాంతాలను జల్లెడ పడుతోంది. చిన్నారి ఆచూకీ కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించగా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి వంగలపూడి అనిత అధికారులు నుంచి వివరాలు తెలుసుకున్నారు. అనుమానాస్పదంగా మృతి చెందిన పెంపుడు కుక్కకు పోస్టుమార్టం నిర్వహించనున్నారు.