మా కుటుంబాన్ని వైసీపీ నేతలు ట్రోల్‌ చేశారు

కాకినాడ జిల్లా తునిలో జరిగిన బాలిక అత్యాచారం కేసులో నిందితుడు నారాయణరావు కోడలు నాగలక్ష్మి, వైసీపీ నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు. శుక్రవారం తునిలో మీడియాతో మాట్లాడుతూ, వైసీపీ పెద్దల వద్ద డబ్బు తీసుకుని కొందరు నేతలు ఆందోళనకు దిగి రాజకీయ లబ్ధి పొందారని ఆరోపించారు. తమ మామ తప్పు చేస్తే, వైసీపీ నాయకులు తమ కుటుంబ సభ్యుల ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టి ట్రోల్ చేసి మానసికంగా క్షోభకు గురి చేశారని తెలిపారు. బాలిక కోసం ధర్నా చేసిన దళిత నేతలు, మాలమహానాడు నాయకుడైన తమ మామ చనిపోతే ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఆడపిల్లల విషయంలో ఇలాంటి ఘటనలకు పాల్పడేవారిపై కఠినంగా వ్యవహరించాలని మంత్రి లోకేశ్‌ను నాగలక్ష్మి కోరారు.

సంబంధిత పోస్ట్