తుని తహశీల్దార్ జీపీఎస్ ప్రసాద్, తాండవ నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని కోరారు. సోమవారం రెల్లిపేట, తారకరామా నగర్, ఇసుకలపేట ప్రాంతాల్లో పర్యటించి, ప్రజలను పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించారు. భారీ వర్షాల కారణంగా తాండవ నదికి వరద వచ్చే అవకాశం ఉందని, మంగళవారం తుఫాన్ తీవ్రతరం అయ్యే అవకాశం ఉన్నందున పునరావాస కేంద్రాల్లోకి వెళ్లాలని ఆయన తెలిపారు.