కాకినాడ జిల్లా తుని పట్టణంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం నాడు రోటరీ రంగం యువజన ఉత్సవాలు 2025 కార్యక్రమాన్ని రోటరీ జిల్లా గవర్నర్ గుత్తికొండ శ్రీరామ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమం 30 ఏళ్లుగా నిర్వహిస్తున్నామని, విద్యార్థుల్లో చదువుతో పాటు ఆటలు, పాటలు కూడా ఉండాలని రోటరీ రంగం చైర్మన్ డి.మధుసూదన్ తెలిపారు. నెలరోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో 15 రకాల ఈవెంట్లు నిర్వహిస్తామని, విద్యార్థుల్లో పోటీతత్వం పెంచడమే లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ టి. నాగిరెడ్డి, సెక్రటరీ డి. ప్రసన్నకుమార్, పి. కిషోర్, పి. ఎల్. ఎస్. ఎన్. మూర్తి, రోటరీ సభ్యులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, స్కూల్ యాజమాన్యాలు పాల్గొన్నారు.