ఎమ్మెల్యే దివ్య కృషితో పలు ఏరియాలకు ఆర్టీసీ బస్ సర్వీసులు

కాకినాడ జిల్లా తుని నుండి కొన్ని ప్రత్యేకమైన రూట్లలో తుని నుంచి బస్సు సర్వీసులు లేక ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడేవారు. ముఖ్యంగా సామర్లకోట, పెద్దాపురం చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్లాలంటే తుని నుంచి చాలా కష్టంగా అనిపించేది. ఈ ఇబ్బందులను ఎమ్మెల్యే యనమల దివ్య దృష్టికి తీసుకు వెళ్లడంతో కార్యాచరణకు నడుంబిగించి ఆ రూట్లలో బస్సు సర్వీసులను ప్రారంభించేలా చర్యలు తీసుకున్నారు. తుని నుంచి పిఠాపురం, పెద్దాపురం, సామర్లకోట, రంగంపేట మీదుగా రాజమండ్రికి రెండు బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి. ప్రయాణికులు ఎమ్మెల్యే యనమల దివ్య కు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్

✕
✕