విజయవాడలోని జనసేన పార్టీ కార్యాలయంలో వైసీపీ సీనియర్ నాయకుడు యనమల కృష్ణుడు తన అనుచరులతో కలిసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో శుక్రవారం చేరారు. పవన్ కళ్యాణ్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించి, జిల్లాలో జనసేన బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. ఈ చేరిక కాకినాడ, తుని ప్రాంతాలలో జనసేనను బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు.