ఆదివారం తుని పట్టణంలోని రామకృష్ణ కాలనీలో విద్యుత్ మీటర్ బాక్స్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ట్రాన్స్‌ఫార్మర్‌కు సమీపంలో మంటలు ఎగసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందడంతో, వారు వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది.