తుని మండలం ఎర్రకోనేరు సెంటర్ వద్ద శనివారం రాత్రి జాతీయ రహదారి–16పై ఒక కాంక్రీట్ మిక్సర్ వాహనం అదుపుతప్పి రహదారి పక్కన ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ఉన్నవారు బయటకు పరుగులు తీయడంతో పెను ప్రమాదం తప్పింది. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు.