ఏపీలో త్వరలో రాబోతున్న మున్సిపల్, పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన పార్టీ సమాయత్తమవుతోంది. స్థానిక ఎన్నికల ప్రచార కమిటీ సమన్వయకర్తగా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్‌ను నియమిస్తూ పార్టీ అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ కమిటీలో ఏపీఎంఎస్ఐడీసీ చైర్మన్ శ్రీ చిల్లపల్లి శ్రీనివాసరావు సభ్యుడిగా వ్యవహరిస్తారు. క్షేత్రస్థాయి ప్రచార నిర్వహణ, ప్రచార సామాగ్రి సమకూర్చడం వంటి కీలక బాధ్యతలను ఈ కమిటీకి అప్పగించారు