AP: పల్నాడు జిల్లా కారంపూడి ఎస్ఐ వాసును అధికారులు సస్పెండ్ చేశారు. ఆర్థిక లావాదేవీల విషయంలో ఎస్ఐ వేధిస్తున్నాడని గాదేవారిపల్లెకు చెందిన దంపతులు వెల్లడించారు. బూటు కాళ్లతో తన్నుతూ, తన భార్య పట్ల అసభ్యకరంగా మాట్లాడుతూ వేధిస్తున్నాడని బాధితుడు చల్ల అయ్యప్ప ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్ఐ వేధింపులు భరించలేక మనస్తాపంతో వివాహిత లక్ష్మి పురుగు మందు తాగారు. ఈ ఘటన వైరల్‌గా మారడంతో ఎస్ఐ వాసుపై అధికారులు చర్యలు చేపట్టారు.