కాశీబుగ్గ తొక్కిసలాట ఘటన.. రాహుల్ గాంధీ దిగ్భ్రాంతి (వీడియో)

AP: కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భక్తులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని పేర్కొంటూ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. స్థానిక కాంగ్రెస్ శ్రేణులు సహాయక చర్యల్లో పాల్గొని బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్