AP: గుడివాడలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. మంగళవారం వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నానితో మాజీ మంత్రి కటారి ఈశ్వర్ భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై ఇద్దరూ చర్చించారు. ఈ మేరకు గుడివాడలో జడ్పీ ఛైర్మన్, బీసీ మహిళ ఉప్పాల హారికపై జరిగిన దాడిని కటారి ఈశ్వర్ ఖండించారు. గుడివాడలో మహిళలకు రక్షణ లేదని, అధికార పార్టీ నేతల దాడిని అడ్డుకుంటామని ఆయన ప్రకటించారు.