డ్రగ్ పార్క్ అమరావతిలోనే పెట్టుకోండి: అమర్నాథ్

AP: బల్క్ డ్రగ్ పార్క్ విషయంలో మత్స్యకారులకు ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి హామీ ఇవ్వలేదని మాజీ మంత్రి అమర్నాథ్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 22న ‘చలో రాజయ్యపేట’ కార్యక్రమం చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు డ్రగ్ పార్కును వ్యతిరేకించారని, అమరావతిలో వేల ఎకరాలు తీసుకుంటున్న చంద్రబాబు ఈ ప్రాజెక్టును అక్కడే పెట్టుకోవాలని, రాజయ్యపేట ప్రజలను ఇబ్బందులకు గురిచేయొద్దని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్