AP: మాజీ ఎంపీ కేశినేని నాని పొలిటికల్ రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. టీడీపీ నుంచి వరుసగా రెండు సార్లు ఎంపీగా గెలిచిన నాని.. 2024 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత రాజకీయాలకు దూరమయ్యారు. ఇప్పుడు మళ్లీ రాజకీయాల్లోకి రానున్నట్లు సంకేతాలు వస్తున్నాయి. బీజేపీలో చేరబోతున్నారని టాక్ వినిపిస్తోంది. భవిష్యత్‌లో విజయవాడ ఎంపీ సీటు ఆశించి నాని బీజేపీలో చేరుతున్నారని సమాచారం.