రతన్‌టాటా కంపెనీనే కేశినేని నాని మోసం చేశారు: ఎంపీ చిన్ని

AP: మాజీ ఎంపీ కేశినేని నానిపైవిజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ సంచలన ఆరోపణలు చేశారు. రూ.120 కోట్ల మేర బ్యాంకు కుంభకోణానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. రైతులు, ఆటో డ్రైవర్ల నుంచి చిన్న మొత్తాల రుణాల చెల్లింపులో విఫలమైతే ఆస్తులు, వాహనాలు స్వాధీనం చేసుకునే బ్యాంకులు, ప్రజాధనం లూటీ చేసిన మాజీ ఎంపీపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. కేశినేని నాని బ్యాంకు ఖాతాలో రూ.7 కోట్లు ఉన్నా ఆటో డెబిట్ ఎందుకు చేయడం లేదని, న్యాయ వ్యవస్థలోని లొసుగులను అడ్డంపెట్టుకుని ఆయన న్యాయస్థానాలను తప్పుదోవ పట్టించారని శివనాథ్ ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్