AP: పార్టీ అధిష్టానం పిలుపు మేరకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గతంలో తన 'గుడ్ మార్నింగ్ ధర్మవరం' కార్యక్రమంపై వచ్చిన ఆరోపణలను ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఖండించారు. వైసీపీని వీడి వెళ్ళిన వారికి ఇక శాశ్వతంగా పార్టీలో ప్రవేశం ఉండదని, డబ్బు సంపాదించి వేరే పార్టీల్లోకి వెళ్ళిన వారిని తిరిగి చేర్చుకునేది లేదని ఆయన హెచ్చరించారు. గత ఎన్నికల్లో పార్టీ మారిన వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఆయన ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.