పీఎస్ వద్ద కేతిరెడ్డి పెద్దారెడ్డి నిరసన (వీడియో)

AP: అనంతపురం జిల్లా తాడిపత్రి రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి శుక్రవారం నిరసన చేపట్టారు. వైసీపీ నేతలపై దాడులు జరుగుతున్నా.. పోలీసులు ఎందుకు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సజ్జలదిన్నె, ఇగుడూరు గ్రామాల్లో వైసీపీ నేతలకు చెందిన వాహనాలు ధ్వంసం చేసిన జేసీ వర్గీయులపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఐ నారాయణ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్

✕
✕