AP: కేబినెట్ రేపు ఉదయం 10.30 గంటలకు అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కీలక సమావేశం నిర్వహించనుంది. ఈ భేటీలో అమరావతి అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, భూ కేటాయింపులు, ట్విన్ టవర్ల నిర్మాణం, శాసనసభ భవన పనులు, రైతులకు యాన్యుటీ, పెన్షన్ నిబంధనల్లో మార్పులు, వివిధ సంస్థలకు భూముల కేటాయింపు వంటి అనేక అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.