ఏపీలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ లో కీలక మార్పు.. సర్కార్ ఆదేశాలు

ఏపీలో ఉద్యోగాలు, సంక్షేమ పథకాల కోసం సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. గతంలో మ్యాన్యువల్ విధానంలో జరుగుతున్న ఈ ప్రక్రియ వల్ల ఆలస్యం, అనర్హుల ప్రవేశం వంటి సమస్యలు తలెత్తుతున్న నేపథ్యంలో, ప్రభుత్వం ఇకపై అన్ని సర్టిఫికెట్లను డిజిటల్ విధానంలోనే ధృవీకరించాలని ఆదేశించింది. ఇందుకోసం 'డిజీ వెరిఫై' ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించాలని సూచించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ మాట్లాడుతూ, ఈ డిజిటల్ విధానం వల్ల ఫిజికల్ కాపీల అవసరం తగ్గి, వెరిఫికేషన్ జాప్యం కూడా తగ్గుతుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్

✕
✕