సాయికృష్ణ కస్టోడియల్‌ డెత్‌ కేసులో కీలక పరిణామం

AP: సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మరో ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లను నిందితులుగా చేర్చింది. కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుళ్లు బాబురావు, సాంబయ్యలను వరుసగా ఏ5, ఏ6 నిందితులుగా నమోదు చేసింది. దీంతో ఈ కస్టోడియల్ డెత్ కేసులో నిందితుల సంఖ్య ఆరుకు చేరింది. కాగా, ఈ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్