ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో నిందితులుగా ఉన్న వారి ఆస్తుల జప్తునకు ఏసీబీ కోర్టు అనుమతిచ్చింది. రూ.32 కోట్ల విలువైన ఆస్తులను సీజ్ చేసేందుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, వైసీపీ హయాంలో మద్యం సేకరణ, పంపిణీ, ధరల నిర్ణయంలో భారీగా అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై సిట్ దర్యాప్తు చేస్తోంది. మద్యం స్కామ్‌లో ఇప్పటికే చాలా మందిని అరెస్ట్ చేసి విచారించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్