AP: మాజీ మంత్రి వివేకానందారెడ్డి హత్య కేసు విచారణ సీబీఐ కోర్టులో జరిగింది. ఈ కేసులో లోతైన దర్యాప్తు కోరుతూ వివేకా కుమార్తె సునీత పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సీబీఐ కోర్టులో వాదనలు జరిగాయి. సునీత తరపు సీనియర్ కౌన్సిల్ సిద్ధార్థ లూథ్రా, వివేకా హత్య కేసులో కుట్ర కోణం ఉందని, సీబీఐ పూర్తిస్థాయి దర్యాప్తు జరపలేదని, కేసులో లోతైన దర్యాప్తు అవసరమని కోర్టుకు వివరించారు. అసలు దోషులు తప్పించుకునే అవకాశం ఉందని, సప్లిమెంటరీ చార్జిషీటు దాఖలు చేసేలా సీబీఐకి ఆదేశాలు ఇవ్వాలని కోరారు.