టీడీపీలో చేరిన జనసేన పార్టీ కీలక నేత

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు బిగ్ షాక్ తగిలింది. చిత్తూరు నగర జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు గల్లా రూపేష్, మరో 50 మంది జనసైనికులు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. కూటమిలోని జనసేనను వీడి, అదే కూటమిలోని టీడీపీలో చేరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గత 8 ఏళ్లుగా జనసేనలో పనిచేస్తున్న రూపేష్, వైసీపీ ప్రభుత్వంలోనూ జనసేన జెండాను బలంగా మోసి ఇప్పుడు పార్టీ మారడంతో ఈ అంశం చర్చనీయాంశమైంది.

సంబంధిత పోస్ట్