AP: చిత్తూరు జిల్లాలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. నగరంలోని 43వ డివిజన్‌కు చెందిన టీడీపీ నాయకుడు నూతన ప్రసాద్, మరో ముగ్గురు నాయకులు వైసీపీలో చేరారు. వైసీపీ సమన్వయకర్త విజయానందరెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం విజయానందరెడ్డి మాట్లాడుతూ రోజురోజుకు టీడీపీ బలం తగ్గుతోందని, తర్వలో మరికొంతమంది టీడీపీ నాయకులు వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలిపారు.