ఉచిత బస్సు ప్రయాణంపై కీలక అప్‌డేట్

AP: ఆగస్టు 15 నుంచి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేయనున్న విషయం తెలిసిందే. అయితే ఈ పథకాన్ని అమలు చేస్తే ఎంత మందికి లబ్ధి చేకూరుతుందన్న విషయంపై APSRTC అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఆర్టీసీలో 11,449 బస్సులున్నాయి. ఈ బస్సుల్లో రోజుకు 16.11 లక్షల మంది మహిళలు ప్రయాణిస్తున్నారు. ఉచిత బస్సు అమలు చేస్తే ప్రయాణికుల సంఖ్య 26.95 లక్షలకు పెరుగుతుందని అంచనా. దీని వల్ల నెలకు రూ.242 కోట్ల మేర భారం పడనుంది.

సంబంధిత పోస్ట్