AP: కృష్ణా జిల్లా గుడివాడలో వైసీపీ, కూటమి పోటాపోటీ కార్యక్రమాలతో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి పేర్నినాని సహా ముఖ్య నాయకులను మచిలీపట్నంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో మచిలీపట్నంలోని పేర్ని నాని నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఇక, ముఖ్య నాయకులు లేకుండానే 'బాబూ ష్యూరిటీ- మోసం గ్యారెంటీ' కార్యక్రమం కొనసాగుతుంది.