ధాన్యం సేకరణకు 2,619 కొనుగోలు కేంద్రాలు: మంత్రి నాదెండ్ల

AP: నవంబర్ 1 నుంచి ఖరీఫ్ ధాన్యం సేకరణ ప్రారంభిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. శుక్రవారం విజయవాడలో ఆయన మాట్లాడుతూ.. ‘37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఎల్‌నినో ప్రభావంతో ధాన్యం సేకరణ అంచనా తగ్గింది. వర్షాల ఆధారంగా అవసరమైతే కేంద్రంతో మాట్లాడి మార్పులు చేస్తాం. ఖరీప్ ధాన్యం సేకరణకు 2,619 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాం. ధాన్యం సేకరించిన 24 గంటలలోపు రైతులకు బిల్లులు చెల్లించాం’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕