AP: విజయనగరం జిల్లా వేపాడ మండలంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అక్కడి అరిగిపాలెంలో రుణం చెల్లించలేదని ఓ బాలుడిని ఫైనాన్స్ సంస్థ కిడ్నాప్ చేసింది. కొన్ని నెలల క్రితం రాజేశ్వరి అనే మహిళ ఓ ఫైనాన్స్ సంస్థ వద్ద రూ.60 వేలు రుణం తీసుకుంది. వివిధ కారణాలతో కట్టలేకపోయింది. దీంతో ఆమెపై దాడి చేసిన కంపెనీ ఏజెంట్లు బాలుడిని అపహరించారు.