తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కిరణ్ కుమార్ రెడ్డి

తిరుమల శ్రీవారిని  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బుధవారం దర్శించుకున్నారు. స్వామి వారిని దర్శించుకుని తలనీలాలు సమర్పించారు. ఇక అలాగే నేడు భారత ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి అవినాష్ కుమార్, మరాఠీ సినిమా నటి రింకూ రాజ్‌గురు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.ఈ సందర్భంగా ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించారు. ప్రముఖుల రాకతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది.

సంబంధిత పోస్ట్