కిర్లంపూడి యాక్సిడెంట్.. నాలుగుకి చేరిన మృతుల సంఖ్య (వీడియో)

AP: కాకినాడ జిల్లా జగ్గంపేట సమీపంలోని కిర్లంపూడి మండలం సోమవరం నేషనల్ హైవేపై జరిగిన భయంకర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య నాలుగుకి చేరింది. వేగంగా దూసుకొచ్చిన కారు ద్విచక్రవాహనాలను ఢీకొట్టడంతో ఈ యాక్సిడెంట్ జరిగింది.  ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వారిని కాకినాడ జీజీహెచ్‌కు తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ ఇర్రిపాక గ్రామానికి చెందిన 17 ఏళ్ల విద్యార్థిని దుర్గాచైతన్య మృతిచెందింది. మిగిలిన వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్