AP: అనంతపురం జిల్లా పామిడి పట్టణ కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. రవి అనే యువకుడు మతిస్థిమితం సరిగా లేకపోవడంతో కత్తితో వీరంగం సృష్టించి స్థానికులను భయభ్రాంతులకు గురి చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోగా.. వారిపైనా దాడికి పాల్పడ్డాడు. పోలీసు జీపుపై కర్రలతో దాడి చేశాడు. ఈ ఘటనపై రవి బంధువులు స్పందిస్తూ.. అతను కొద్దిరోజులుగా మతిస్థిమితం సరిగా లేక చికిత్స తీసుకుంటున్నాడని వెల్లడించారు.