తిరుచానూరు పద్మావతి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

AP: తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి, సహస్రనామార్చన, శుద్ధి నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణం, పూజా సామగ్రిని పవిత్ర జలాలతో శుద్ధి చేసి, భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు. ఏప్రిల్ 29న వసంతోత్సవాలకు అంకురార్పణ జరగనుంది. ఏప్రిల్ 30 నుండి మే 2 వరకు వసంతోత్సవాలు జరుగుతాయి. ఈ సందర్భంగా మే 1న స్వర్ణ రథోత్సవం, స్నపన తిరుమంజనం, ఆలయ నాలుగు మాడ వీధుల్లో అమ్మవారి విహారం ఉంటాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్