నేడు TDP క్రమశిక్షణ కమిటీ ముందుకు కొలికపూడి, కేశినేని (VIDEO)

టీడీపీ అంతర్గత విభేదాలపై నేడు (మంగళవారం) కీలక పరిణామం చోటుచేసుకోనుంది. MLA కొలికపూడి శ్రీనివాస్‌, ఎంపీ కేశినేని చిన్ని మధ్య సాగుతున్న గొడవలపై విచారణ కోసం ఇద్దరినీ క్రమశిక్షణ కమిటీ ముందుకు హాజరు కావాలని పిలిపించారు. కొలికపూడి ఉదయం 11 గంటలకు, కేశినేని చిన్ని సాయంత్రం 4 గంటలకు హాజరుకానున్నారు. కమిటీ చైర్మన్ వర్ల రామయ్య నేతృత్వంలో విచారణ జరగనుంది. ఇరువురిపై తగిన చర్యలకు పార్టీ హైకమాండ్ సన్నద్ధమైందని సమాచారం.

సంబంధిత పోస్ట్