ప్రమాదవశాత్తు అదుపుతప్పి లారీ బోల్తా పడింది. అల్లవరం మండలం బోడసకుర్రులోని మేకల కాలువ వంతెన వద్ద గురువారం మధ్యాహ్నం వ్యాన్ బోల్తా పడిన ఘటన చోటుచేసుకుంది. అమలాపురం వైపు లోడుతో వస్తున్న వ్యాన్ అదుపుతప్పి పంట కాలువ వైపు తిరగబడింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రాణాపాయం లేకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. వ్యానులో ఉన్న డ్రైవర్ తో పాటు ఇతరులు స్వల్ప గాయాలతో బయటపడినట్లు స్థానికులు వివరించార.