అమలాపురం మండలం బోడసకుర్రులో సోమవారం ఒక ఇంట్లోకి తాచుపాము దూరింది. దీంతో ఇంట్లోనివారు భయపడి స్నేక్ క్యాచర్ వర్మకు సమాచారం అందించారు. వర్మ అక్కడికి చేరుకుని పామును చాకచక్యంగా పట్టుకుని నిర్మానుష్య ప్రాంతంలో వదిలిపెట్టారు. పాముల సంచారం పట్ల అప్రమత్తంగా ఉండాలని, కనిపిస్తే చంపకుండా తనకు సమాచారం ఇవ్వాలని వర్మ సూచించారు.