అమలాపురం: బీచ్ ఫెస్టివల్ ను ఆకట్టుకునే రీతిలో నిర్వహించాలి

జనవరి 12 నుండి 16వ తేదీ వరకు సురసేన యానాం గోవా కోకో బీచ్‌లో సంక్రాంతి సంబరాలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఆదేశించారు. బుధవారం అమలాపురం మండల పరిధిలోని ఎస్ యానాం బీచ్‌లో జరిగిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ ఏడాది నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఈవెంట్లకు మద్దతు ప్రకటించిందని తెలిపారు. దూర ప్రాంతాల పర్యాటకులను ఆకట్టుకునేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్