అమలాపురం మండలం కామనగరువు ఫ్లైఓవర్ సమీపంలో మతిస్థిమితం లేని వ్యక్తి మృతదేహాన్ని తాలూకా పోలీసులు గుర్తించారు. మేథాగార్డెన్ కు చెందిన బత్తుల ఏడుకొండలు (61) గతంలో ఆర్టీసీలో ఉద్యోగం చేశారు. కొంతకాలంగా మతిస్థిమితం లేకుండా తిరుగుతున్నాడు. 6వ తేదీన ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కామనగరువు బైపాస్ సమీపంలో బహిర్భూమికి వెళ్లి మృతి చెందినట్లుగా అక్కడ ఆనవాళ్లు బట్టి గుర్తించినట్లు ఎస్ఐ శేఖర్ బాబు శనివారం తెలిపారు.