అమలాపురం: శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి పనులు: ఎమ్మెల్యే

గ్రామీణ ప్రాంతాల్లో శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు తెలిపారు. అల్లవరం మండలం గోపాయలంక పంచాయతీ పరిధిలో ఉపాధి హామీ నిధులతో నిర్మించనున్న సిమెంట్ కాంక్రీట్ రోడ్లకు ఆయన గురువారం శంకుస్థాపన చేశారు. సర్పంచ్ శ్రీదేవి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్