డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం అమలాపురం, రోళ్ళపాలెం, కొంకపల్లి, పేరూరు మరియు పాలు ప్రాంతాల్లో శనివారం తెల్లవారుజాము నుండి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ వర్షం వల్ల వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఇప్పటికే పలు జిల్లాల్లో గత రెండు మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి.