అమలాపురం పట్టణంలోని మాచిరాజు వీధిలో శుక్రవారం ఒక వింత సంఘటన జరిగింది. స్థానికుడు కాజులూరి కృష్ణారావు మార్కెట్ నుండి తెచ్చిన బొప్పాయి పండును కోయగా, అందులో వినాయకుడి ప్రతిరూపం కనిపించింది. ఈ పండును పూజా మందిరంలో ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు వినాయక ప్రతిరూపాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.