అమలాపురం: అప్పుడు పులి పాదముద్రలు.. ఇప్పడు క్షుద్ర పూజలు..!

అమలాపురం మండలం సవర్పపాలెం కేతవారి దిబ్బ ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు మూడేళ్ల క్రితం పులి సంచరిస్తున్నట్లు పాదముద్రలు వేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు. గ్రామస్థుల ఫిర్యాదుతో అటవీ అధికారులు పులి సంచారం లేదని నిర్ధారించినప్పటికీ, ఆదివారం రాత్రి మళ్లీ క్షుద్ర పూజల ఆనవాళ్లతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్