అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో వైసీపీ ఆధ్వర్యంలో చేపట్టిన యువత పోరు బాట కార్యక్రమంలో భాగంగా బుధవారం జిల్లా కలెక్టరేట్ ను వైసీపీ నాయకులు, కార్యకర్తలు ముట్టడించారు. వైసీపీ శ్రేణులను కలెక్టరేట్ లోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. మాజీ మంత్రి పినిపే విశ్వరూప్, మాజీ ఎమ్మెల్యేలు జగ్గిరెడ్డి, సతీష్ కుమార్ ఆధ్వర్యంలో వైసీపీ కార్యకర్తలు కలెక్టరేట్లోకి ప్రవేశించి ధర్నా నిర్వహించారు.