అంబాజీపేట: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

అంబాజీపేట మండలం పరిధిలోని ముక్కామల వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అమలాపురానికి చెందిన రేఖా లక్ష్మీ అనే మహిళ మృతి చెందింది. దైవ దర్శనానికి వెళ్లి వస్తూ ఉండగా అమలాపురం ఆర్టీసీ డిపో బస్సును కారు ఎదురుగా వెళ్లి ఢీకొంది. ఈ ఘటనలో మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను అమలాపురంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా మార్గమధ్యలో రేఖాలక్ష్మీ మృతి చెందారు.

సంబంధిత పోస్ట్