మురమళ్ళ వీరేశ్వరస్వామి అన్నదానం ట్రస్టుకు అమలాపురానికి చెందిన శ్రీభ్రమరాంబా చెన్నమల్లేశ్వర స్వామి నెలవారీ లక్ష పత్రి పూజా సంఘం ఆధ్వర్యంలో కొత్తలంక ప్రభాకరశర్మ రూ. 25 వేలు విరాళం గురువారం అందించారు. ఈవో మాచిరాజు లక్ష్మీనారాయణ దాతను అభినందించారు. ఆర్చకుడు యనమండ్ర సుబ్బారావు దాతను శేషవస్త్రం, ప్రసాదం, స్వామి చిత్రపటం అందించి సత్కరించారు.