చింతలపల్లిలో బైకు కారు ఢీ.. యువకుడు స్పాట్ డెడ్!

గురువారం తెల్లవారుజామున చింతలపల్లి కళింగుల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో శివకోడుకు చెందిన కుసుమ చందు (23) అనే యువకుడు మృతి చెందారు. బైక్‌పై వెళ్తున్న చందును కారు బలంగా ఢీకొట్టడంతో ఆయన అక్కడికక్కడే మరణించినట్లు స్థానికులు తెలిపారు. మృతుడు అవివాహితుడని, తల్లిదండ్రులు గల్ఫ్ దేశంలో ఉన్నారని సమాచారం. 108 సిబ్బంది మృతిని నిర్ధారించగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్