ఉప్పలగుప్తం మండలం ఎస్. యానాం సముద్ర తీరంలో మంగళవారం సాయంత్రం గల్లంతైన వారిలో రెండవ యువకుడు జస్వంత్ మృతదేహం బుధవారం వాసాలతిప్ప తీర ప్రాంతంలో లభ్యమైంది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఏసీ మెకానిక్గా పనిచేస్తున్న జస్వంత్ మృతితో అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.