ఉపాధి హామీ కూలీలకు వికసిత్ భారత్ కరపత్రాలు పంపిణీ

కోనసీమలోని మామిడికుదురులో ఉపాధి హామీ పని దినాలను 125 రోజులకు పెంచిన సందర్భంగా ఎన్డీఏ కూటమి నాయకులు ఉపాధి కూలీలకు 'వికసిత్ భారత్ - జి రామ్ జి కరపత్రాలను గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా 125 రోజుల ఉపాధి హామీ, నిరుద్యోగ భృతి, సకాలంలో వేతనాలు, గ్రామసభ ద్వారా ప్రణాళికలు వంటి అంశాలను వివరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా మీడియా కన్వీనర్ కొట్నాల కిరణ్, జేఎస్‌పీ గ్రామ శాఖ నాయకులు జడ్డు రాజు, టీడీపీ గ్రామ శాఖ నాయకులు గుబ్బల కృష్ణ, పంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్