డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా గురువారం పలు ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో అల్లవరం మండలం తూర్పులంకలో ఇంటిపై పిడుగు పడడంతో మంటలు చెలరేగాయి. పిడుగు పడిన సమయంలో ఇంటిలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు చెప్పారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.