అప్పుల బాధతో రైతు ఆత్మహత్య: SI

వద్దిపర్రుకు చెందిన రైతు వీరవల్లి అయ్యప్ప (40) వ్యవసాయంలో నష్టాలు, అప్పుల బాధతో మనస్థాపానికి గురై పురుగుమందు సేవించి ఆత్మహత్య చేసుకున్నారని SI ఎస్.రాము తెలిపారు. గురువారం జరిగిన ఈ ఘటనలో, కుటుంబ సభ్యులు ఆయనను రాజమండ్రి ఆస్పత్రికి తరలించగా, పరిస్థితి విషమించడంతో కాకినాడకు తీసుకెళ్తుండగా దారిలో మృతి చెందారు. మృతుడి భార్య నాగలక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్